పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

న్యూఢిల్లీ: రోజు రోజుకూ ఇంధన ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో లీటరు పెట్రోల్ ధర వంద దాటింది. ఒకవైపు కరోనా తరుముతుంటే.. మరో వైపు ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. మహమ్మారి వేళ కూడా బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ .. నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో .. పెట్రోల్, డీజిల్పై పన్ను కేవలం 9.20 మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు అది రూ.32కు చేరినట్లు ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై పెరిగిన ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేసీ వేణుగోపాల్ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

