Gaurav Gogoi | లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్
Gaurav Gogoi | కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌ను లోక్‌సభలో డిప్యూటీ లీడర్‌గా ఆ పార్టీ నియమించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్, చీఫ్ విప్, ఇద్దరు విప్‌లను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌ను (Gaurav Gogoi) లోక్‌సభలో డిప్యూటీ లీడర్‌గా ఆ పార్టీ నియమించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ పంపింది.
లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్, చీఫ్ విప్, ఇద్దరు విప్‌లను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ మేరకు ఒక లేఖను సోనియా గాంధీ పంపారని చెప్పారు.
కాగా, కేరళ నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన కొడికున్నిల్ సురేష్, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా వ్యవహరిస్తారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. విరుదునగర్ ఎంపీ మాణికం ఠాగూర్, కిషన్‌గంజ్ ఎంపీ మహ్మద్ జావేద్ లోక్‌సభలో పార్టీ విప్‌లుగా వ్యవహరిస్తారని చెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు ప్రజల సమస్యలపై శక్తివంతంగా పోరాడతాయని వేణుగోపాల్ అన్నారు. ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

