ఆపరేషన్ కమల్ భయం.. ముందే హోటళ్లు బుక్చేస్తున్న కాంగ్రెస్!
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్‌కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్థులను హోటళ్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నది.

గువాహటి: అసోంలో ఆపరేషన్ కమల్‌కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్థులను హోటళ్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం అసోంలోని హోటళ్లను ముందుగానే బుక్చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా గువాహటిలోని ఓ హోటళ్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అభ్యర్థులతో రహస్య సమావేశం నిర్వహించారని సమాచారం. బహిరంగ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఈనెల 22న వారిని గువాహటి, తేజ్‌పూర్, కజిరంగాకు తరలించనున్నారని తెలుస్తున్నది.
కాగా, పార్టీ సీనియర్ నేత జితేంద్ర సింగ్ ఈ వార్తలను కొట్టిపాడేశారు. ఎన్నికల్లో తమ కూటమి భారీ మెజారిటీ సాధిస్తుందని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులు ఎక్కడికీ వెళ్లడంలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించామని తెలిపారు.
అయితే ప్రలోభాల భయంతో కాంగ్రెస్ కూటమిలోని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఇప్పటికే తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించారు. అసోంలో మూడువిడుతల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చే నెల 2న వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
12.25 కోట్ల డోసుల టీకాల పంపిణీ
వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి
30 లక్షల మంది బలి!
ఆరువారాల్లో బీభత్సమే
నేడు టీకా బంద్
టాలీవుడ్‌ని వణికిస్తున్న కరోనా.. హిట్ చిత్రాల దర్శకుడికి పాజిటివ్!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- BJP
- Candidates
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

