హిజాబ్‌ను వ్యతిరేకిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తా : కాంగ్రెస్ నాయకుడు
బెంగళూరు : హిజాబ్ వివాదంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ను వ్యతిరేకించే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఖాన్ హెచ్చరించాడు. ఈ మేరకు కర్ణాటక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కలబురాగిలో నిర్వహించిన ఓ సమావేశానికి ముఖరం ఖాన్ హాజరై ప్రసంగించారు. హిజాబ్‌ను వ్యతిరేకిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చచ్చిపోతాం.. జీవితం ఉన్నంత వరకు ఇండియన్‌గానే బతకాలి. ఎవరైతే హిజాబ్‌ను వ్యతిరేకిస్తున్నారో వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఏదో ఒక రోజు మనమంతా చనిపోయేవాళ్లమే. ఇంత దానికి మతాలను అంటగట్టడం సరికాదు. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడాలి. మీరు ఏదైనా ధరించొచ్చు. మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తే.. ఊరుకునే సమస్య లేదని, ఇలాంటి చర్యలను సహించబోమని ముఖరం ఖాన్ స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

