Idea please | అగ్రి బిజినెస్‌పై ఐడియాతో రండి.. రూ.25 లక్షలు పెట్టుబడిగా అందుకోండి..!
Idea please | వ్యవసాయ రంగంలో స్టార్టప్‌కు కొత్త కోణాన్ని జోడించేందుకు హిసార్ చరణ్ సింగ్ యూనివర్శిటీ ఐడీయాలను ఆహ్వానిస్తుంది. మంచి ఐడియాకు రూ.25 లక్షల పెట్టుబడిని బహుమతిగా కూడా అందివ్వనున్నారు. ఈ నెల 31 లోగా దరఖాస్తులను..
Idea please | ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఈ వాణిజ్య ప్రకటన చాలా కాలం నుంచి అందరి నోట్లో నానుతూనే ఉన్నది. ఇక్కడ వ్యవసాయ వాణిజ్యం కోసం ఓ ఐడియాతో రావాలంటూ యూనివర్శిటీ భారీ ఆఫర్ ఇస్తున్నది. అగ్రి బిజినెస్ కోసం సూపర్ డూపర్ ఐడియాతో రావాలని హర్యానా హిసార్‌లోని చౌదరీ చరణ్ సింగ్ క్రిషీ విశ్వవిద్యాలయం ఆహ్వానిస్తున్నది. ఎంపికైనా ఐడియాకు రూ.25 లక్షలు పెట్టుబడిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పోటీల్లో పాల్గొనాలని ఆశించేవారు ఈ నెల 31 లోగా యూనివర్శిటీ వెబ్సైట్ www.hau.ac.in లో దరఖాస్తు చేయాలి.
వ్యవసాయ రంగంలో స్టార్టప్‌కు కొత్త కోణాన్ని అందించేందుకు విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, పారిశ్రామికవేత్తలు.. ఎవరైనా తమ ఐడియాలను షేర్ చేసుకోవచ్చు. మార్కెటింగ్, నెట్వర్కింగ్, లైసెన్సింగ్, ట్రేడ్‌మార్క్, పేటెంట్ టెక్నాలజీ, ఫండింగ్‌కు సంబంధించి శిక్షణ ఉంటుంది. వ్యవసాయ రంగంలో వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. పహల్, సఫాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడంతోపాటు రెండు నెలల శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
దరఖాస్తులను ఉచితంగా అందించవచ్చు. దరఖాస్తు చేసుకునే వ్యక్తి హర్యానాకు వచ్చి తన వ్యాపారాన్ని స్థాపించడానికి ఇష్టపడే వారై ఉండాలి. అగ్రి బయోటెక్, హార్టికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, పశుసంవర్ధక, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫార్మింగ్ మెకనైజేషన్, తక్కువ ఖర్చుతో కూడిన అధిక ఉత్పత్తి, సప్లై చైన్ మేనేజిమెంట్, హార్వెస్ట్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్, ఆహార ప్రక్రియ, వ్యాల్యూ యాడింగ్తో పాటు వ్యవసాయంలో కృత్రిమ మేధ మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని విశ్వవిద్యాలయం పేర్కొన్నది. మరెందుకాలస్యం.. ఇప్పుడే మీ ఐడియాలను పంపించండి.. అగ్రి బిజినెస్ కోసం రూ.25 లక్షల వరకు పెట్టుబడిగా పొందండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

