e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 28, 2022
Home News గుడ్‌న్యూస్ : జాబ్ మార్కెట్‌లో మ‌ళ్లీ కొలువుల క‌ళ‌!

గుడ్‌న్యూస్ : జాబ్ మార్కెట్‌లో మ‌ళ్లీ కొలువుల క‌ళ‌!

న్యూఢిల్లీ : భార‌త్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య కొవిడ్‌-19కు ముందున్న స్ధాయిని అక్టోబ‌ర్‌లో అధిగ‌మిస్తుంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) పేర్కొంది. సెప్టెంబ‌ర్‌లో ఉపాధి అవ‌కాశాల్లో గ‌ణనీయ‌మైన వృద్ధితో పాటు అక్టోబ‌ర్‌లో అదే జోరు కొన‌సాగుతుండ‌టంతో జాబ్ మార్కెట్ క‌రోనాకు ముందున్న స్థితికి చేరుతుంద‌ని సీఎంఐఈ అంచ‌నా వేసింది. సెప్టెంబ‌ర్‌లో 85 ల‌క్ష‌ల కొలువులు అందుబాటులోకి రాగా మొత్తం 46.2 కోట్ల మంది ఉద్యోగాల్లో కుదురుకున్నార‌ని ఇది 2019-20లో కంటే కేవ‌లం 27 ల‌క్ష‌లు త‌క్కువ‌ని సీఎంఐఈ పేర్కొంది.

కార్మిక భాగ‌స్వామ్య రేటు, ఉపాధి రేటు పెరుగుతుండ‌టంతో అక్టోబ‌ర్‌లో ఇదే జోరు కొన‌సాగుతూ మ‌రింత వృద్ధి చోటుచేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఉద్యోగాల సంఖ్య 2019-20 స్ధాయిని అధిగ‌మించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని సీఎంఐఈ నివేదిక ఆశాభావం వ్య‌క్తం చేసింది. ఇక అక్టోబ‌ర్ 17తో ముగిసిన వారాంతానికి కార్మిక భాగ‌స్వామ్యం రేటు 41.6 శాతంగా ఉండ‌గా, నిరుద్యోగ రేటు 7.6 శాతం నుంచి 7.3 శాతానికి త‌గ్గ‌డం సానుకూల ప‌రిణామ‌మ‌ని పేర్కొంది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement