శనివారం 28 మార్చి 2020
National - Mar 03, 2020 , 18:35:09

NPRపై సీఎం జగన్‌ ట్వీట్‌

NPRపై సీఎం జగన్‌ ట్వీట్‌

అమరావతి: ఎన్‌పీఆర్‌–2020ను పాత ఫార్మాట్‌లోనే నిర్వహించాలని కోరుతూ శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.  జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విటర్లో స్పందించారు.  'ఎన్‌పీఆర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు ఏపీలోని మైనార్టీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయి. ఈ అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చించాం. 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కోరతాం. మైనార్టీల మనోభావాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తాం. అవసరమైన మేరకు కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతామని' జగన్‌ ట్వీట్‌ చేశారు. 


logo