Arvind Kejriwal | ఎల్జీ సాబ్ ఏం జోక్ చేస్తున్నారా..? ఎల్జీ లేఖపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శలు
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ప్రస్తావించారు.
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ప్రస్తావించారు. సీఎం ఉద్దేశపూర్వకంగా జైలులో క్యాలరీలు తక్కువగా ఉండే డైట్ తీసుకుంటున్నారని తెలిపారు. దాంతో ఆయన బరువు కోల్పోతున్నాడని ప్రస్తావించారు. జూన్ 6 నుంచి జూలై 13 మధ్య సరైన సహాయం ఆహారం తీసుకోలేదని.. కేజ్రీవాల్ డైట్ చార్ట్ పాటించడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావించారు. సీఎం సూచించిన ఆహారం, మందులు తీసుకోకపోవడంపై ఎల్జీ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం ఎందుకు మందులు వాడటం లేదో తేల్చాలని లేఖలో పేర్కొన్నారు.
జులై 7 రాత్రి భోజనానికి ముందు తీసుకోవాల్సిన ఇన్సులిన్ డోస్‌ను ఆయన తిరస్కరించినట్లు జైలు అధికారులు అందించిన నివేదికలో తెలుస్తోందని పేర్కొన్నారు. ఇది కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా డాక్టర్ల సూచనలు పాటించేలా ప్రొటోకాల్ అమలు చేయాలన్నారు. అయితే, ఎల్జీ లేఖపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ‘ఎల్జీ సాహెబ్ ఏం జోక్ చేస్తున్నారా? రాత్రి సమయంలో ఎవరైనా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకుంటారా..? జబ్బు గురించి తెలియకుండా ఆ లేఖ రాయాల్సింది కాదు’ మండిపడ్డారు. మరో వైపు మంత్రి అతిషి మాట్లాడుతూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ ఎనిమిదిసార్లు 50 కంటే తక్కువకు పడిపోయిందని.. దాంతో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్ మరో కుట్ర బట్టబయలైందన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంట్లో వండిన ఆహారం ఇస్తున్నట్లు లేఖలో స్పష్టంగా ఉందని.. జూన్ 6 నుంచి జూలై 13 మధ్య ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకున్నాడని ఆరోపించారు. బరువు తగ్గడానికి ఆహారం తీసుకోవడం లేదని.. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని.. బెయిల్ వచ్చేలా జైలులో బరువు తగ్గుతున్నానని చెప్పాలనుకుంటున్నారని అన్నారు. 21 రోజుల పాటు బెయిల్‌పై ఉన్నారని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేస్తూ కష్టపడి పడ్డారని.. ఆ సమయంలో ఆరోగ్యం బాగానే ఉందన్నారు. జైలుకు వెళ్లడానికి రెండు రోజుల ముందు ఆరోగ్యం బాగోలేదని నటించారన్నారు. ఆరోగ్యం బాగోలేదన్న సాకుతో ఎలాగోలా జైలు నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

