CJI Chandrachud | వాతావరణ మార్పులపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు..
CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని సీజేఐ ఆవిష్కరించారు.
CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు మత్స్యకారులు, రైతులతో పాటు సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రంతో పాటు పౌరులు కలిసి పని చేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. నిన్న గోవాలో వర్షాలు కురిశాయని.. నారాలి పౌర్ణమి రోజున మత్స్యకారులు సముద్రానికి కొబ్బరికాయలు సమర్పిస్తే వర్షాలు ముగుస్తాయని చిన్నప్పుడు చెప్పేవారన్నారు. కానీ, అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు.
వాతావరణ మార్పులతో అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. వాతావరణ మార్పు సంపన్నులను మాత్రమే ప్రభావితం చేయదని.. కానీ ఇది సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన మత్స్యకారులు, రైతులను కూడా ప్రభావితం చేస్తోందన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ రాష్ట్రం పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, మెరుగుపరుస్తుంది. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని నిర్దేశిస్తుంది. అయితే, ఆర్టికల్ 51A (g) ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని చెబుతుంది’ అన్నారు. దేశంలోని న్యాయస్థానాలు సుస్థిర అభివృద్ధి సూత్రం, కాలుష్యదారుల చెల్లింపుల భావనతో పాటు ఇంటర్-జనరేషన్ ఈక్విటీ ఆధారంగా స్థిరమైన న్యాయశాస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాయని సీజేఐ చెప్పారు. ఇంటర్-జనరేషన్ ఈక్విటీ అనేది అమ్మమ్మలు, తాతలు మనకు నేర్పించిన విషయాలు అన్నారు. ప్రకృతి గురించి పొందిన జ్ఞానాన్ని తరతరాలకు అందించడం, మనం గతంలోని పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

