Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Saurav Das : సీజేపీ లీడర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు బుధవారం రాత్రి ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. వీరికి ఆ వెంటనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాకిచ్చారు.
Saurav Das : సీజేపీ లీడర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు బుధవారం రాత్రి ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. వీరికి ఆ వెంటనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాకిచ్చారు. జైలు నుంచి ఇద్దరూ బయటకు వచ్చిన కొద్ది సేపటికే నోటీసులు అందించారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 22, గురువారం మధ్యాహ్నం క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.
బీఎన్ఎస్ సెక్షన్ 233 ప్రకారం జారీ చేసిన నిబంధనల్ని పాటించకపోవడం వల్ల నమోదైన కేసుకు సంబందించి విచారణకు రావాలని కోరారు. అలాగే, సీజేపీ నిరసన సందర్బంగా జంతర్‌మంతర్ వద్దకు అక్రమంగా దూసుకెళ్లారంటూ కూడా కేసు నమోదైంది. మరో సీజేపీ నేత అజింక్యా షిండేను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ నిరసనల్లో అతడి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను.. అక్టోబర్ 13న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో వారం రోజులు జుడీషియల్ కస్టడీలో ఉంచారు.
దీనిలో భాగంగా తిహార్ జైలుకు తరలించారు. బుధవారం వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెరో రూ.50,000 పూచీకత్తుపై విడుదల చేసింది కోర్టు. అయితే, మరో మూడు రోజుల జుడీషియల్ కస్టడీ కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మళ్లీ కస్టడీ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో బెయిల్‌పై ఇద్దరూ గురువారం సాయంత్రం విడుదలకాగా.. ఆ వెంటనే పోలీసులు మరో నోటీసు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

