23 నుంచి దేశవ్యాప్త నిరసన
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తామని గురువారం విలేకరుల సమావేశంలో సీజేపీ పేర్కొంది.
- సర్’పై ఆందోళనలు ఉధృతం
- జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే
- నేడు ఢిల్లీలో తిరంగా మార్చ్
- కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తామని గురువారం విలేకరుల సమావేశంలో సీజేపీ పేర్కొంది. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న తమ డిమాండ్‌ను కూడా సీజేపీ పునరుద్ఘాటించింది. అక్టోబర్ 23 నుంచి తాము నిరసనను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ తెలిపింది. ఈ ఆందోళనలో రైతులు, దళితులు, విద్యార్థులు, జెన్‌జీ (నేటి యువతరం) భాగస్వాములు అవుతారని తెలిపింది. సర్కి సంబంధించిన కేసును విచారిస్తున్న బృందానికి తాము ఇప్పటికే సాక్ష్యాలను సమర్పించామని, ఇప్పుడు తమ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని సీజేపీ పేర్కొంది.
జ్ఞానేశ్ కోసం సొంత పౌరులపైనే యుద్ధమా?
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ఆరోపించారు. ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన యువత అంతా వీధుల్లో పోరాడుతున్నారు. వారిని వీధుల వెంట ఈడ్చుకెళ్లారు. ఆయేషాను ఈడ్చుకెళ్లారు. విలాజ్ను ఈడ్చుకెళ్లారు. ఇషాను ఈడ్చుకెళ్లారు. ఎవరి కోసం? జ్ఞానేశ్ కుమార్ అనే ఒక్క వ్యక్తిని కాపాడటం కోసం అని దీప్కే ఆరోపించారు. ప్రభుత్వం తన సొంత పౌరులపైనే యుద్ధంచేస్తున్నదని ఆయన అన్నారు. ఒక నియంత అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాగలదని పేర్కొంటూ శుక్రవారం(16వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని సెంట్రల్ పార్క్‌లో సమావేశం కావాలని దీప్కే పిలుపునిచ్చారు. జ్ఞాను(జ్ఞానేశ్ కుమార్) మీ పెంపుడు జంతువు అని ప్రధాని మోదీని ఉద్దేశించి దీప్కే ఆరోపించారు. ప్రజలంతా త్రివర్ణ పతాకాన్ని తమ వెంట తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

