Court Judge Suicide | మహిళా న్యాయమూర్తి ఆత్మహత్య.. ఉత్తరప్రదేశ్‌లో ఘటన
Court Judge Suicide | మహిళా న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. (Court Judge Suicide) ప్రభుత్వ నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఆమె ఇంటికి చేరుకున్నారు.
లక్నో: మహిళా న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. (Court Judge Suicide) ప్రభుత్వ నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఆమె ఇంటికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఈ సంఘటన జరిగింది. మౌకు చెందిన జడ్జి జ్యోత్స్నా రాయ్ ఏడాది కిందట అయోధ్య నుంచి బదాయూ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యారు. ప్రభుత్వ క్వాటర్స్‌లో నివసిస్తున్న ఆమె శనివారం ఉదయం తలుపులు తెరువలేదు. గమనించిన పని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డోర్ పగులగొట్టి ఇంటి లోపలకు వెళ్లిన పోలీసులు న్యాయమూర్తి జ్యోత్స్నా రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది జ్యోత్స్నా రాయ్ నివాసానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడకు చేరుకుని ఆధారాల కోసం నమూనాలు సేకరించింది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా న్యాయమూర్తిది రెండో పోస్టింగ్ అని కోర్టు అధికారులు తెలిపారు. ఆమె సూసైడ్‌కు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Civil court
- Dies
- judge
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

