Chandrababu | రాజమండ్రి జైలులో కొనసాగుతున్న చంద్రబాబు విచారణ..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ (CID) డీఎస్పీ నేతృత్వంలోని 12 మందితో కూడిన బృందం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారిస్తున్నది.
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ (CID) డీఎస్పీ నేతృత్వంలోని 12 మందితో కూడిన బృందం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారిస్తున్నది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం ఇవ్వనున్నారు. చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. కస్టడీకి తీసుకునేముందు, తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణను వీడియోగ్రాఫర్‌తో రికార్డు చేయించాలని స్పష్టం చేసింది. ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

