Yediyurappa | పోక్సో కేసులో యెడియూరప్పకు సీఐడీ నోటీసులు
Yediyurappa | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు యెడియూరప్పకు పోక్సో కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, బెంగళూరు రాగానే సీఐడీ ముందు విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు.
Yediyurappa | బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు యెడియూరప్పకు పోక్సో కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, బెంగళూరు రాగానే సీఐడీ ముందు విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ 17 ఏండ్ల బాలిక పట్ల యెడియూరప్ప అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక తల్లి మార్చి 14వ తేదీన సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో యెడియూరప్పకు నోటీసులు జారీ అయ్యాయి. తాను ఎవర్నీ కూడా లైంగికంగా వేధించలేదని, ఈ కేసు విషయంలో న్యాయ పోరాటం చేస్తానని యెడియూరప్ప గతంలో ప్రకటించారు. ఇక ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న బాధితురాలి తల్లి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెలలో చనిపోయారు. ఈ కేసులో బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- CID Police
- karnataka
- pocso case
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

