చైనా ఆక్రమణల అంశంపై పార్లమెంట్లో చర్చించబోం: కేంద్రం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు.
న్యూఢిల్లీ: చైనా ఆక్రమణల అంశాన్ని పార్లమెంట్లో చర్చించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం అన్ని పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, సరిహద్దులో చైనా ఆక్రమణలను లేవనెత్తారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరుపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో దీనిపై పార్లమెంట్లో చర్చ జరుపబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, అఖిలపక్ష సమావేశం తర్వాత పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో 27 పార్టీల తరుఫున 37 మంది నేతలు పాల్గొన్నట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరినట్లు వెల్లడించారు.
మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ తొలిదశ సమావేశాలు జరుగుతాయి. అనంతరం మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు మలి దశ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. పలు బిల్లులను ప్రభుత్వం ఆమోదించనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

