చైనాకు భారతీయ విద్యార్థులు… షరతులతో ఓకే చెప్పిన డ్రాగన్ కంట్రీ
కోవిడ్ కారణంగా భారత్‌లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. అయితే.. కొన్ని షరతులతో, కొందరికే ప్రస్తుతానికి అనుమతి ఉంటుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా చైనా సర్కార్ కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ చదివే భారతీయ విద్యార్థులు భారత్‌లోనే వుండిపోయారు.
ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఓ ప్రకటన విడుదల చేశారు. చైనాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. ఈ విషయంపై భారత్‌కు కొన్ని మార్గదర్శకాలను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి… అత్యావశ్యకమైన విద్యార్థులు మాత్రమే చైనాకు వచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో మెడిసిన్ అభ్యసిస్తున్నారు. 2019 లో చైనాలో కరోనా స్వైర విహారం చేయడంతో వారు భారత్‌కు తిరిగి వచ్చేశారు. చైనా ప్రభుత్వం మార్గదర్శకాలివ్వకపోవడంతో వారు ఇక్కడే ఉండిపోయారు. అప్పటి నుంచి చైనాకు తిరిగి వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కోవిడ్ కారణంగా చైనా సర్కార్ విధించిన ఆంక్షలతో ఇక్కడే వుండిపోయారు.
”ఇప్పుడు కోవిడ్ విజృంభణ చైనాలో తీవ్రంగానే వుంది. అయినా… భారత్‌కు చెందిన కొంత మంది విద్యార్థులను చైనాకు తిరిగి రప్పించేందుకు మేము రెడీగా వున్నాం. అంతర్జాతీయంగా వున్న కోవిడ్ పరిస్థితులను కూడా మేం లెక్కలోకి తీసుకోవాలి. ఈ సూత్రమే సహజంగా విదేశీ విద్యార్థులందరికీ వర్తిస్తుంది” అని చైనా అధికార ప్రతినిధి జావో లిజియన్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

