Indian Railways | పిల్లలపై ఛార్జీలు విధించి.. 2800 కోట్లు సంపాదించిన రైల్వే
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.
Indian Railways | న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) ఇచ్చిన సమాచారం మేరకు పిల్లల టిక్కెట్ల చార్జీల ద్వారా రైల్వే శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.560 కోట్లతో అత్యధిక లాభాలను పొందింది. 2016-17 నుంచి 2022-23 వరకు విశ్లేషించిన డాటా ప్రకారం 3.6 కోట్ల మంది పిల్లలు ప్రత్యేక రిజర్వ్డ్ సీట్ ఆప్షన్ పొందకుండా సగం ధర చెల్లించి రైళ్లలో ప్రయాణించగా, 10 కోట్ల మంది పిల్లలు టిక్కెట్‌కు పూర్తి చార్జి చెల్లించి బెర్త్/సీట్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు.
వీరి కారణంగానే రైల్వేకు అధిక మొత్తంలో ఆదాయం సమకూరింది. మొత్తం ప్రయాణించిన పిల్లలలో 70 శాతం మంది పూర్తి చార్జి చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016లో రైల్వే ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం 5-12 ఏండ్ల పిల్లలు టిక్కెట్ ధరలో సగం చార్జి చెల్లించి ప్రయాణించవచ్చు. అయితే అతనికి సీటు/బెర్త్ కేటాయించరు. అలా కాకుండా వారికి సీటు/బెర్త్ రిజర్వ్ చేసుకోవాలంటే పూర్తి టిక్కెట్ చార్జీ చెల్లించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CRIS
- Indian Railways
- Railways
- RTI
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

