CJI | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirumala temple) భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన సతీమణితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఉదయం ఆలయానికి చేరుకున్న సీజేఐ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈవో ధర్మారెడ్డి సీజేఐకి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Chief Justice of India Justice DY Chandrachud Ji along with his family offered prayers at Tirumala temple today.#TTD#TTDevasthanams#Tirumala#Tirupati pic.twitter.com/WdIi2P6dd0
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) March 27, 2024
Also Read..
Saudi Arabia | మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి
Arvind Kejriwal | కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ..!