Saudi Arabia | మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి
Saudi Arabia | ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది.
Saudi Arabia | ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మిస్ యూనివర్స్ (Miss Universe event) పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రుమీ అల్కహ్తానీ (Rumy Alqahtani) అనే 27 ఏళ్ల అందాల భామను ఈ పోటీలకు ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని రూమీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి అని, మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా రూమీ నిలవనుంది.
73వ మిస్ యూనివర్స్ పోటీలు ఈ ఏడాది సెప్టెంబర్ 28న జరగనున్న విషయం తెలిసిందే. మెక్సికోలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో సౌదీ అరేబియా తొలిసారి భాగస్వామ్యం కానుంది. మరోవైపు రియాద్ నగరానికి చెందిన రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏసియన్లోనూ ఆమె పాలుపంచుకున్నారు.
Also Read..
Ram Charan | తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు.. క్లీంకారా ఫేస్ రివీల్
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిర ప్రాంగణంలో తుపాకీ మిస్ ఫైర్.. జవాన్‌కు తీవ్ర గాయాలు
Solar Storm | భూమిని తాకిన బలమైన సౌర తుఫాన్.. భూ అయస్కాంత క్షేత్రంలో అవరోధాలు..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

