Man Partially shaved hair, moustache | ఓడిన బీజేపీ అభ్యర్థి.. మీసం సగం తీసి, అర గుండు చేయించుకున్న వ్యక్తి
Man Partially shaved hair, moustache | బీజేపీ అభ్యర్థి ఓడిపోతే మీసం సగం తీయడంతోపాటు అర గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి స్నేహితులతో పందెం కాశాడు. (Man Partially shaved hair, moustache) ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో పందెం ప్రకారం అన్నంత పని చేశాడు.
రాయ్‌పూర్: బీజేపీ అభ్యర్థి ఓడిపోతే మీసం సగం తీయడంతోపాటు అర గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి స్నేహితులతో పందెం కాశాడు. (Man Partially shaved hair, moustache) ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో పందెం ప్రకారం అన్నంత పని చేశాడు. మీసం సగం వరకు షేవ్ చేయడంతోపాటు అర గుండు చేయించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఆదివారం కౌంటింగ్ సందర్భంగా ఎలక్ట్రీషియన్ దేర్హా రామ్ యాదవ్ తన స్నేహితులతో పందెం కాశాడు. కల్లారి అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అల్కా చంద్రకర్ ఓడిపోతే తన తల, మీసం పాక్షికంగా తీసేస్తానని చెప్పాడు.
కాగా, ఆదివారం నాటి ఎన్నికల ఫలితాల్లో కల్లారి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ద్వారికాధీష్ యాదవ్ చేతిలో బీజేపీ అభ్యర్థి చంద్రకర్ ఓడిపోయాడు. దీంతో దేర్హా రామ్ యాదవ్ వెంటనే బార్బర్ షాప్‌కు వెళ్లాడు. పందెం మేరకు సగం గుండు కొట్టించుకోవడంతోపాటు సగం వరకు మీసం తీసేశాడు. అతడు అరగుండు, అర మీసంతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bet
- Bjp Candidate
- Chhattisgarh
- hair
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

