Abhay Singh Chautala | హరియాణలో ఐఎన్ఎల్డీతో బీఎస్పీ పొత్తు ఖరారు
Abhay Singh Chautala : హరియాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీల మధ్య పొత్తు ఖరారైంది.
Abhay Singh Chautala : హరియాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీల మధ్య పొత్తు ఖరారైంది. ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి పోరాడతాయని ఇరు పార్టీలు గురువారం ప్రకటించాయి. పదేండ్లుగా హరియాణను లూటీ చేస్తున్న బీజేపీని అధికారం నుంచి సాగనంపాలని, కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రజలంతా తమ కూటమికి మద్దతుగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఓ ఫ్రంట్‌గా ఏర్పడి ప్రజల విశ్వాసం చూరగొంటామని చెప్పారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో సంకీర్ణ సర్కార్ ఏర్పాటవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీతో పొత్తు వివరాలను చౌతాలా ప్రకటించారు.
మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దీపీందీర్ సింగ్ హుడా బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు. తాను కాషాయ పార్టీ ఏజెంట్‌నని ఆయన తన పనుల ద్వారా నిరూపించుకున్నారని చౌతాలా ఎద్దేవా చేశారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని, ప్రజలకు ఇచ్చే హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా చౌతాలా భరోసా ఇచ్చారు.
Read More :
Rains | మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

