ChatGPT | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వచ్చీరావడంతోనే కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనాలకు చిరునామాగా మారిన చాట్‌జీపీటీ మొండికేస్తున్నది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగానే సమాధానాలిస్తున్నది. మరింత సమాచారం కావాలంటే వేరే సాధనాల ద్వారా వెతుక్కోండి అంటూ కఠినంగా చెప్తున్నది.
ఇంకొన్ని ప్రశ్నలకు ‘ఆన్సర్ ఇవ్వను’ అన్న సందేశాలను కూడా పంపిస్తున్నది. దీంతో ఏఐ చాట్‌బోట్ వైఖరిపై పలువురు యూజర్లు మండిపడుతూ మాతృసంస్థ ఓపెన్ఏఐకు ఫిర్యాదులు చేశారు. స్పందించిన నిర్వాహకులు గత నవంబర్ నుంచి చాట్‌బోట్‌ను అప్డేట్ చేయలేదని, అందుకే, అలాంటి సమాధానాలు రావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.