న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) నవ్వించారు. లోక్‌సభలో చాలా స్మూత్‌గా ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై ఆమె లోక్‌సభలో గురువారం ప్రసంగించారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆమె జోకేశారు. బిల్లులు రూపొందించిన విధానం గురించి ప్రస్తావిస్తూ అమిత్ షాపై ప్రియాంకా గాంధీ కామెంట్ చేశారు. హోంమంత్రి నవ్వుతున్నారని, ఆయనే మొత్తం ప్లాన్ చేశారని, ఒకవేళ చాణక్యుడే బ్రతికి ఉంటే, మీ రాజనీతికి ఆయన కూడా ఖంగుతినేవాడని ఆమె అన్నారు. చాలా సింపుల్‌గా ప్రియాంకా వ్యాఖ్యలు చేయడంతో అమిత్ షా నిజంగానే నవ్వేశారు.ఆ వ్యాఖ్యలపై ఆయన ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిన వైనాన్ని ప్రస్తావిస్తూ ప్రియాంకా ఆ వ్యాఖ్యలు చేశారు. అంతా ప్లాన్ చేసి ఇప్పుడు నవ్వుతున్నారని, అంటే ఆయన తనతో ఏకీభవిస్తున్నారని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. చాణక్యుడు అనడంతో అమిత్ షా నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లపై ఎందుకు మహిళా రిజర్వేషన్ ఇవ్వడం లేదని ఆమె అడిగారు.
चाणक्य ज़िंदा होते तो चुनाव जीतने की इनकी साज़िशें देख चौंक जाते…
गृह मंत्री जी हँस रहे हैं—खी खी खी!
— प्रियंका गाँधीसियासत में बयानबाज़ी से फिर गरमाया राजनीतिक माहौल—“खी खी खी!”😜🤣#PriyankaGandhi #AmitShah #Parliament #PoliticalSatire #BJP #Congress pic.twitter.com/cjAIdwYpqD
— Maharashtra Bandhu News (@BandhuNews_in) April 16, 2026