CERT-In | గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో లోపాలు.. యూజర్లకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!
CERT-In | కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో (Google Chrome) తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించింది.
CERT-In | కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో (Google Chrome) తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించింది. లోపాలను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు విలువైన డేటాను తస్కరించేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పనిసరిగా అందరూ గూగుల్ క్రోమ్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్ యూజర్లకు ప్రత్యేకంగా హెచ్చరికలు చేసింది.
ప్రస్తుతం మొబైల్ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. సైబర్ దాడుల నుంచి తప్పించుకునేందుకు పాత వెర్షన్ వాడుతున్న వారంతా కొత్త వెర్షన్‌కు అప్డేట్ కావాలని కేంద్ర ప్రభుత్వంలోని ఈ ఏజెన్సీ పేర్కొంది. విండోస్ ఓఎస్‌లో గూగుల్ క్రోమ్ 136.0.7103.113/.114 కంటే పాత వెర్షన్స్, లినక్స్, మ్యాక్ ఓఎస్ 136.0.7103.113 కంటే పాత వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బ్రౌజర్ లోడర్, మోజో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లోని లోపాల కారణంగా సమస్యలు వస్తాయని తెలిపింది. రిమోట్ హ్యాకర్ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ లింక్‌పై క్లిక్ చేసేలా యూజర్లను పురిగొల్పవచ్చని సెర్ట్-ఇన్ పేర్కొంది.
లింక్‌పై క్లిక్ చేస్తే క్రోమ్‌లోని లోపాలను ఆసరా చేసుకొని మాల్వేర్, ఇతర కోడ్‌ని సిస్టమ్‌లోకి చొప్పించి.. మొత్తం కంప్యూటర్ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఇదే జరిగితే సిస్టమ్‌లోని డేటా అంతా లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా ఉండేందుకు తప్పనిసరిగా అందరూ తమ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అప్డేట్ చేసుకునేందుకు క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ఎబౌట్ క్రోమ్‌పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

