OTT Platforms | ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కేంద్రం వార్నింగ్..!
OTT Platforms | ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది.
OTT Platforms | ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ఫారమ్‌లకు అడ్వైజరీని జారీ చేసింది. డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్లామరైజ్ కంటెంట్‌ను చూపిస్తే.. దానిపై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. సిరీస్‌లు, ఇతర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న సమయంలో డ్రగ్స్‌పై ప్రచారం చేయొద్దని సూచించింది.
సినిమాలు, సీరియల్స్‌లో నటులు మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను యూజర్ వార్నింగ్ లేకుండా ప్రసారం చేయకూడదని చెప్పింది. డ్రగ్స్ వినియోగాన్ని చూపించడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది. అలాంటి సున్నితమైన కంటెంట్ ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన సీన్స్ చూపించే సమయంలో తప్పనిసరిగా హెచ్చరికలు ఉండాల్సిందేనని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

