Tamil Nadu CM Stalin | చెన్నై: బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిపై కక్ష సాధించేందుకే యూసీసీని తీసుకొస్తున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. చెన్నైలో గురువారం స్టాలిన్ మాట్లాడారు.
మతం, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నియంత పాలనను సాగించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే అమల్లో ఉన్న సివిల్, క్రిమినల్ కోడ్లను తొలగించి, బీజేపీ భావజాలం ప్రకారం యూసీసీని తీసుకొస్తున్నారని విమర్శించారు.