Jamili Elections | జమిలిపై కేంద్రం వెనకడుగు.. లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి బిల్లుల తొలగింపు!
ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
- నేడు సభలో ప్రవేశపెట్టే అవకాశం లేనట్టే
Jamili Elections | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా రివైజ్ చేసిన లోక్‌సభ బిజినెస్ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు.
వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు)ను సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే దానిని వాయిదా వేసి సోమవారం జాబితా చేసిన ఆర్థిక బిల్లులను సభ ఆమోదించిన తర్వాత ఈ వారంలోనే జమిలి ఎన్నికల బిల్లులు తీసుకురావచ్చునని ప్రభుత్వం తెలిపింది. కాగా, లోక్‌సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లుల అజెండా లేకపోయినప్పటికీ లోక్‌సభ అనుమతితో లెజిస్లేటివ్ అజెండా కింద సభలో ప్రవేశపెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20తో ముగియనున్నందున ఆ సమావేశాలు ముగిసే లోగా జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెడతారని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

