వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నారు. అంతేకాదు వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉంటే ఇవ్వబోయే వ్యాక్సిన్ల సంఖ్యలో కోత ఉంటుందనీ హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజే ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జార్ఖండ్‌లో అత్యధికంగా 37 శాతం వ్యాక్సిన్ వృథా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చత్తీస్‌గఢ్ (30 శాతం), తమిళనాడు (15.5 శాతం), జమ్ముకశ్మీర్ (10.8 శాతం), మధ్యప్రదేశ్ (10.7 శాతం) ఉన్నాయి. వ్యాక్సిన్ల వృథాలో జాతీయ సగటు 6.3 శాతం కాగా.. ఈ రాష్ట్రాలు అంతకన్నా ఎక్కువగా వృథా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
కొత్త మార్గదర్శకాలు ఇవీ
- 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్లు ఇస్తున్న నేపథ్యంలో వీళ్లలో ప్రాధాన్యతా క్రమం నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే ఉంటుంది.
- వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి, కొత్త వ్యాక్సిన్లన ప్రోత్సహించడానికి మొత్తం ఉత్పత్తిలో 25 శాతం నేరుగా ప్రైవేటు హాస్పిటల్స్‌కు అమ్ముకునే అవకాశం తయారీదారులకు కల్పించారు.
- ప్రైవేటు హాస్పిటల్స్‌కు అమ్మే ధరను ప్రతి వ్యాక్సిన్ తయారీదారు ప్రకటించాలి. అందులో మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ప్రైవేటు హాస్పిటల్స్ గరిష్ఠంగా సర్వీస్ చార్జీల రూపంలో రూ.150 వసూలు చేయాలి. ఈ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

