Sabarimala Entry: శబరిమలలోకి మహిళల ఎంట్రీ.. ఆంక్షలను సమర్థించిన కేంద్రం
Sabarimala Entry : శబరిమల ఆలయంలోకి ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. 9 మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నారు.
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ఎంట్రీ(Sabarimala Entry) అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. 9 మంది సభ్యుల ధర్మాసనం విభిన్న కోణాల్లో ఈ అంశాన్ని విచారిస్తున్నది. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ బీవీ నాగరత్న, ఎంఎం సుందరేశ్, అషానుద్దిన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మాసి, ప్రసన్న బి వర్లే, ఆర్ మహాదేవన్, జోయ్మాల్యా బాగ్చీ ఉన్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న అంశంతో పాటు మరికొన్ని అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది. అయితే సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వ సమర్థించింది.
అయితే ఆ అంశం మత విశ్వాసాలకు చెందుతుందని, మతం పరిధిలోకి వస్తుందని, జుడిషియల్ పరిధిలోకి ఇది రాదు అని ప్రభుత్వం చెప్పింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఏదైనా అశాస్త్రీయ విధానం ఉంటే, దాన్ని శాసనాల ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు. ప్రతి మతపరమైన విధానాన్ని గౌరవించాలని, ప్రతి అంశాన్ని హుందాతనానికి, శరీర స్వేచ్ఛకు ఆపాదించలేమన్నారు. మసీదుకు వెళ్లినా, గురుద్వారకు వెళ్లినా.. ముఖాన్ని కప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నా గౌరవాన్ని, హక్కును లాక్కున్నారని అనలేమని తుషార్ మెహతా చెప్పారు. మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగం రక్షిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

