Chidambaram | పెట్రో ధరల పెంపును కేంద్రం మాయోపాయంతో దాస్తోంది: చిదంబరం
Chidambaram | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని ఆరోపించారు.
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని ఆరోపించారు. ప్రజల ఖర్చు పెరిగేలా చేసి కేంద్రం లాభాలు వెనకేసుకుంటున్నదని ఆయన మండిపడ్డారు.
కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని, దాంతో చివరికి వినియోగదారుడి జేబుకే చిల్లు పడుతోందని చిదంబరం చెప్పారు. ఇంధన ధరల పెంపు బయటికి కనిపించకుండా పన్నుల భారం మోపుతూ కేంద్రం ప్రజలను దోచుకుంటోందని, మాయోపాయంతో పెట్రో ధరల పెంపును దాస్తున్నదని ఆయన విమర్శించారు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ముడి చమురు ధరలు పెరిగాయని, ఆ సాకు చూపుతూ దేశంలో ఇంధన ధరలు పెంచారని చిదంబరం చెప్పారు. ఆ తర్వాత ముడి చమురు ధరలు దిగొచ్చినా ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయలేదని ఆయన మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

