Padma Awards | పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కారాలు వరించింది వీళ్లనే..
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
Padma Awards |రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ కుమార్, సమాజ్‌వాద్ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, ప్రముఖ సంగీత విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ సహా ఆరుగురికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది.
తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ ప్రకటించింది. స్వామి చిన జీయర్ స్వామి, శ్రీ కమలేశ్ డి పటేల్‌ను పద్మభూషణ్ వరించాయి. మోదడుగు విజయ్ గుప్తా, హనుమంతరావు పసుపులేటి, బి.రామకృష్ణారెడ్డిని పద్మశ్రీ వరించింది. ఏపీకి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఏపీ నుంచి కీరవాణి, గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర, సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, కోటా సచ్చితానంద, ప్రకాశ్‌చంద్ర సూద్, సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ వరించాయి.
పద్మ విభూషణ్ (6) గ్రహీతలు
బాలకృష్ణ దోషి (గుజరాత్) – ఆర్కిటెక్చర్ (మరణానంతరం )
జాకీర్ హుస్సేన్ (మహారాష్ట్ర ) – ఆర్ట్
ఎస్ఎం కృష్ణ (కర్ణాటక ) – పబ్లిక్ అఫైర్స్
దిలీప్‌కుమార్ ( మెడిసిన్ ) – పశ్చిమ బెంగాల్
శ్రీనివాస్ వరదాన్ ( అమెరికా ) – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ములాయం సింగ్ యాదవ్ ( ఉత్తర ప్రదేశ్) – పబ్లిక్ అపైర్స్ (మరణానంతరం )
పద్మ భూషణ్ ( 9) గ్రహీతలు
ఎస్ఎల్ భైరప్ప ( కర్ణాటక ) – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్
కుమార మంగళం బిర్లా ( మహారాష్ట్ర ) ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ
దీపక్ ధార్ ( మహారాష్ట్ర ) – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
వాణి జయరాం ( తమిళనాడు ) ఆర్ట్
చినజీయర్ స్వామి ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం
సుమన్ కల్యాణ్‌పూర్ ( మహారాష్ట్ర ) – ఆర్ట్
కపిల్ కపూర్ (ఢిల్లీ ) – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్
సుధామూర్తి (కర్ణాటక ) – సామాజిక సేవ
కమలేశ్ డి. పటేల్ ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం
పద్మశ్రీ ( 91 ) గ్రహీతలు
సుకమ ఆచార్య ( హర్యానా ) – ఆధ్యాత్మికం
జోధియాబాయ్ బైగా ( మధ్యప్రదేశ్) – ఆర్ట్
ప్రేమ్జీత్ బారియా ( దాద్రా నగర్ )- ఆర్ట్
ఉషా బార్లే ( ఛత్తీస్‌గఢ్) -ఆర్ట్
మునీశ్వర్ చందర్ దావర్ (మధ్యప్రదేశ్) – మెడిసిన్
హేమంత్ చౌహాన్ ( గుజరాత్ ) – ఆర్ట్
భానుబాయ్ చైతరా (గుజరాత్) – ఆర్ట్ ( పెయింటింగ్)
హేమోప్రోవ ఛటియా ( ఆస్సాం) – ఆర్ట్
నరేంద్ర చంద్ర దెబ్బర్మ ( త్రిపుర )
పబ్లిక్ ఎఫైర్స్ సుభద్రా దేవి ( బిహార్) – ఆర్ట్
ఖాదర్‌వళి దుదేకుల ( కర్ణాటక ) సైన్స్ అండ్ ఇంజనీరింగ్
హేమచంద్ర గోస్వామి ( పశ్చిమ బెంగాల్) – ఆర్ట్
రాధా చరణ్ గుప్తా ( ఉత్తరప్రదేశ్) లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్
మోదాడుగు విజయ్ గుప్తా ( తెలంగాణ ) – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
అహ్మద్ హుస్సేస్& మహ్మద్ హుస్సేన్ ( రాజస్థాన్ ) – ఆర్ట్
దిల్షాద్ హుస్సేన్ (ఉత్తరప్రదేశ్) – ఆర్ట్ రతన్
చంద్రాకర్ (అండమాన్ నికోబర్ ) -మెడిసిన్
హీరాబాయి లోబి ( గుజరాత్ ) – సంఘసేవకురాలు ( ట్రైబల్)
రామ్కుయివాంఘ్బే న్యుమె (అస్సాం) – సామాజిక సేవ ( కల్చర్ )
వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ) – సామాజిక సేవ
సంకురాత్రి చంద్రశేఖర్ ( ఏపీ )
సామాజిక సేవ ( అఫ్రడబుల్ హెల్త్ కేర్ )
వడివేల్ గోపాల్ & మసి సదాయ్యన్ ( తమిళనాడు ) – సామాజిక సేవ ( ఎనిమల్ వెల్ఫేర్ )
తుల రామ్ ఉప్రెటి (సిక్కిం) – వ్యవసాయం
నెక్రమ్ శర్మ ( హిమాచల్ ప్రదేశ్ ) – వ్యవసాయం
జనుమ్ సింగరాయ్ (జార్ఖండ్ ) – లిటరేచర్ &ఎడ్యుకేషన్
ధనీరామ్ టోటో (పశ్చిమ బెంగాల్ ) – లిటరేచర్ &ఎడ్యుకేషన్
బి.రామకృష్ణా రెడ్డి ( తెలంగాణ )- లిటరేచర్ &ఎడ్యుకేషన్
అజయ్ కుమార్ మాండవి ( ఛత్తీస్‌గఢ్ ) – ఆర్ట్ (వుడ్ కార్వింగ్)
రాణి మచ్చయ్య (కర్ణాటక ) – ఆర్ట్ ( ఫోక్ డ్యాన్స్)
కేసీ రున్రెంసంగి ( మిజోరం ) – ఆర్ట్ ( వోకల్ – మిజో )
రిసింగబోర్ కుర్కలాంగ్ ( మేఘాలయ ) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్ )
మంగళ కాంతి రాయ్ ( పశ్చిమ బెంగాల్) – ఆర్ట్ (ఫోక్ మ్యూజిక్)
మోవా సుబంగ్ ( నాగాలాండ్) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్ )
మునివెంకటప్ప (కర్ణాటక) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్)
దోమర్ సింగ్ కున్వార్ (ఛత్తీస్‌గఢ్ ) – ఆర్ట్ (డ్యాన్స్)
పరశురాం కొమాజి ఖునె ( మహారాష్ట్ర ) – ఆర్ట్ (థియేటర్ )
గులాం మహమ్మద్ జాజ్ (జమ్మూకశ్మీర్) – ఆర్ట్(క్రాప్ట్స్)
పరేశ్ రాథ్వా (గుజరాత్) – ఆర్ట్ (పెయింటింగ్) కపిల్ దేవ్ ప్రసాద్ (బిహార్) – ఆర్ట్ (టెక్స్టైల్)
పద్మ అవార్డుల పూర్తి జాబితా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

