నవంబర్ 12న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..68 స్థానాలకు ఒకేసారి పోలింగ్
Election Commision: కేంద్ర ఎన్నికల సంఘం.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం.. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 27వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు.
కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ నుంచి 45 మంది, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 2023 జనవరి 8న హిమాచల్‌లో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే 1985 నుంచి ఇప్పటివరకు హిమాచల్‌ప్రదేశ్‌లో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలువలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

