మేమంతా మీ వెంటే..విద్యార్థులకు సినీ, క్రీడా, సాహితీ ప్రముఖుల మద్దతు
నీట్-యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. విద్యార్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ట్వీట్ చేసిన అనంతరం వీరు స్పందించడం గమనార్హం.
న్యూఢిల్లీ, జూలై 23 : నీట్-యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. విద్యార్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ట్వీట్ చేసిన అనంతరం వీరు స్పందించడం గమనార్హం. ఇలా స్పందించిన వారిలో నటీనటులు కమల్ హాసన్, సోనూ సూద్, దియా మీర్జా, అదితి రావు హైదరీ, ప్రకాశ్ రాజ్, నటి, నిర్మాత నందితా దాస్, సినీ రచయిత్రి సుతాప సిక్దార్, భూమి ఫడ్నేకర్, సోనాక్షి సిన్హా, కీడా ప్రముఖులు యువరాజ్ సింగ్, అభినవ్ బింద్రా, మనూబాకర్, నిఖత్ జరీన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎక్స్లో, ఇన్స్టాలో, మీడియాతో వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
విద్యార్థులకు లాఠీలెదురైతే ఆ దేశం విఫలమైనట్టే
‘ఒక పిల్లవాడు ఏడ్చినప్పుడు మనం తప్పక వినాలి. అయితే చాలామంది పిల్లలు చనిపోయేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నేర్చుకోవడం స్థానంలో శిక్షణ, జిజ్ఞాస స్థానంలో నేర ప్రవృత్తి చోటుచేసుకునే వ్యవస్థ కుళ్లిపోయింది. సమాధానాలకు బదులుగా అడ్డంకులు, లాఠీలు ఎదురయ్యాయంటే ఆ దేశం విఫలమైనట్టే. విద్యార్థుల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్ వాంగుచుక్ వెంటనే దీక్ష విరమించాలి.
– నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్
ఓటమి పరవాలేదు.. మోసం చేయకూడదు..
ఓటమి పరవాలేదు. మోసం చేయకూడదు. విజయం కోసం అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న చెప్పేవారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందటం సహజం. మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనందరం సమిష్ఠిగా కృషి చేయాలి. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
– సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

