Arun Goyal | ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి
Arun Goyal | కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Arun Goyal | కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరో మూడేళ్లు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ 2022 నవంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియామకమయ్యారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
అయితే, ఆయనను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, అరుణ్ గోయల్ రాజీనామాతో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల పోస్టులు ఖాళీగా మారాయి. కేవలం ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం సైతం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనున్నది. అయితే, ఆయన స్థానంలో సీఈసీగా బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉన్నది. దాంతో పాటు రాబోయే వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్న తరుణంలో రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

