కోల్‌కతా: పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ (Moloy Ghatak) ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని, ఆయన సతీమణి ఉజిరా నరులా బెనర్జీ, ఆమె సంబంధీకులను కూడాఈడీ విచారించింది.
కాగా, చిట్‌ఫండ్ స్కామ్‌లో ఆదివారం అధికార టీఎం ఎమ్మెల్యే సుబోధ్ అధికారిని, కమల్ అధికారి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో హలిసహర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజు కహానీని ఇప్పటికే అరెస్టు చేసింది.
CBI is conducting searches at five locations in West Bengal – four in Kolkata and one in Asansol – at TMC leader Moloy Ghatak's premises in connection with the coal scam.
(File photo) pic.twitter.com/MCtTZiTisu
— ANI (@ANI) September 7, 2022