అస్సాం సీఎం, జేపీ నడ్డా, రంజిత్ సహా 8 పత్రికలపై కేసు

గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 8 ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్తోసహా 8 ప్రముఖ వార్తా పత్రికలకు వ్యతిరేకంగా డిస్పూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. మోడల్ ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ), ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ఏలో నిబంధనలు, మార్చి 26 భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను బీజేపీ ఉల్లంఘించిందని అస్సాం కాంగ్రెస్ లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ నిరాన్ బోరా ఆరోపించారు.
తొలి దశ ఎన్నికల్లో ఓటమిని గ్రహించిన బీజేపీ, తామే విజయం సాధించబోతున్నట్లు వార్తా పత్రికల్లో ప్రకటనల వార్తలు ప్రచురించారని ఆయన విమర్శించారు. తద్వారా మిగతా దశల పోలింగ్‌లో ఓటర్లను మోసగించేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

