Cartridge | వరుస బెదిరింపుల వేళ.. విమానంలో క్యాట్రిడ్జ్ గుర్తింపు
Cartridge | గత నెలలో దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో (Air India Flight) క్యాట్రిడ్జ్ (cartridge)ను సిబ్బంది గుర్తించారు.
Cartridge | దేశంలో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకూ వందలాది విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ విమానంలో మందుగుండు గుళిక (ammunition cartridge) దొరకడం కలకలం రేపుతోంది.
గత నెలలో దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో (Air India Flight) క్యాట్రిడ్జ్ (cartridge)ను సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ శనివారం ఉదయం తెలిపింది. ‘అక్టోబర్ 27న దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI916 సీటు జేబులో క్యాట్రిడ్జ్ దొరికింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. భద్రతా ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఈ విషయంపై ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
“One ammunition cartridge was found in the pocket of a seat of our flight AI916 after it had landed from Dubai at Delhi on 27 October 2024 and all passengers had safely disembarked. A complaint was immediately lodged with the Airport Police by Air India strictly adhering to the… pic.twitter.com/INwG7Kf9K5
— ANI (@ANI) November 2, 2024
గత కొన్ని రోజులుగా విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో మొత్తం 600కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఉత్తుత్తివేనని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వరుస బాంబు బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలకు రూ.కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది.
Also Read..
Encounter | అనంత్‌నాగ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Elon Musk | ఎక్స్ ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్.. ఇంజినీరింగ్ విభాగంలో లేఆఫ్స్
Us Elections | అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి.. ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

