న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఆరోగ్యకరమైన చర్మ కణాలు లేదా మానవ శరీరంలోని ఏవైనా జీవ కణాలను గుండె కణాలుగా మార్చే ‘రీకాంబినెంట్ ప్రొటీన్ టూల్‌బాక్స్’ను గువాహటి ఐఐటీకి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఇందులో ఆరు రకాల ప్రత్యేక ప్రొటీన్లు ఉంటాయి.
ఈ టూల్‌బాక్స్ ద్వారా సృష్టించే గుండె కణాలు కూడా అసలైన గుండె కణాలుగానే పని చేస్తాయని, ఇవి దెబ్బతిన్న గుండె కణజాలాలను మరమ్మతు చేయడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు. ల్యాబ్‌లలో ఆటోలోగస్ గుండె కణాల ఉత్పత్తిని సైతం ఈ టూల్‌బాక్స్ సులభతరం చేస్తుందని చెప్పారు.