న్యూఢిల్లీ, ఆగస్టు 10: హైదరాబాద్ ఫార్మా సంస్థ బయలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకాను ప్రికాషన్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ తీసుకున్న 18 ఏం డ్లు పైబడినవారందరూ బూస్టర్ డోసుగా కార్బివాక్స్ను తీసుకోవచ్చని పేర్కొన్నది. మొదటి రెండు డోసులు తీసుకున్న టీకా కాకుండా బూస్టర్ డోసుగా మరో కంపెనీ టీకాను అనుమతించడం దేశంలో ఇదే తొలిసారి. కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బివాక్స్ను తీసుకోవచ్చు.