యుద్ధం ఆపాలని పుతిన్ను ఆదేశించగలమా?: సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా అని ఆయన అడిగారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ ఆయన సుప్రీంకోర్టులో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు విషయంలో ఓ న్యాయవాది ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వీలైనంత చేస్తున్నట్లు ఆ ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంలో సీజేఐ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
భారతీయ విద్యార్థుల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు సీజే తెలిపారు. ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నట్లు ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో చూశానని, సీజేఐ ఏం చేస్తున్నారని ఆ వీడియోలో ఒకరు అడిగారని, కానీ యుద్ధాన్ని ఆపాలని నేను పుతిన్ను ఆదేశించగలనా అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఇప్పటికే వేల మంది భారతీయ విద్యార్థుల్ని ఆపరేషన్ గంగాలో భాగంగా ఇండియాకు తీసుకువచ్చారు. ఇవాళ మరో 8 విమానాల్లో సుమారు 3726 మందిని ఇండియాకు తీసుకురానున్నట్లు కాసేపటి క్రితం కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. బుచారెస్ట్ నుంచి 8, సుసేవా నుంచి రెండు, కోసి నుంచి ఒకటి, బుదాపెస్ట్ నుంచి 5, రెజస్వో నుంచి మూడు విమానాలను బయలుదేరనున్నట్లు మంత్రి సింథియా చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

