కోల్కతా: కేంద్ర మంత్రి శంతను థాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లోగా దేశమంతా సీఏఏను అమలు(CAA Implementation) చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పర్గనాస్ జిల్లాలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించామని, మరో ఏడు రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేస్తామని ఆయన అన్నారు. ఇది తన గ్యారెంటీ అని, కేవలం పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సీఏఏను అమలు చేస్తామని ఆయన అన్నారు.
VIDEO | “Ram Mandir has been inaugurated (in Ayodhya), and within the next seven days, the CAA – Citizenship (Amendment) Act – will be implemented across the country. This is my guarantee. Not just in West Bengal, the CAA would be implemented in every state of India within a… pic.twitter.com/f5Ergu5TG3
— Press Trust of India (@PTI_News) January 29, 2024