బస్ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన వాహనం
కర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్‌ను నడుపుతుండగా గుండె పోటుకు గురైన వ్యక్తి వాహనంపై అదుపు కోల్పోవడంతో బస్ పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చింది.
బెంగళూర్ : కర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్‌ను నడుపుతుండగా గుండె పోటుకు గురైన వ్యక్తి వాహనంపై అదుపు కోల్పోవడంతో బస్ పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చింది. ఆపై కొద్దినిమిషాలకే డ్రైవర్ మరణించాడు. మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విజయనగర జిల్లాలోని సిందగి నగర్లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
మృతుడిని కేఎస్ఆర్టీసీ డ్రైవర్ మురిగెప్ప అథనిగా గుర్తించారు. కేఎస్ఆర్టీసీ బస్ అఫ్జల్పూర్ నుంచి విజయపుర వెళుతుండగా డ్రైవర్‌కు గుండె పోటు వచ్చింది. ఈ ఘటనకు ముందు హెడ్‌లైట్ సమస్యతో బస్ రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులను దింపివేసిన అనంతరం బస్ సిందగి బస్ డిపోకు వెళుతోంది. ఖాళీ బస్ సిందగి నగరంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మురిగెప్ప గుండెపోటుకు గురయ్యాడు.
దీంతో వాహనంపై పట్టు కోల్పోవడంతో బస్ పెట్రోల్ బంకులోకి దూసుకురావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. డ్రైవర్ పరిస్ధితిని గమనించిన కండక్టర్ శరణు బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేశారు. కాగా, కండక్టర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
Read More
Viral video | ఏనుగులు రైల్వే ట్రాక్‌ను దాటేందుకు వినూత్న ఏర్పాట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

