Bus accident | అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు.. Video
Bus accident | మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో 64 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Bus accident : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో 64 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
గుజరాత్ సరిహద్దుల్లోని డాంగ్ జిల్లా పరిధిలోగల సత్పురా ఘాట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయడం ప్రమాదానికి కారణమైంది. ఓవర్ టేక్ చేసిన ప్రాంతంలోనే మూలమలుపు ఉండటంతో ఆలస్యంగా గమనించిన బస్సు డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దాంతో బస్సు ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
బస్సులోని ఓ ప్రయాణికుడి జర్నీని తన మొబైల్ రికార్డు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో బస్సు లోయలోకి దూసుకెళ్తున్న దృశ్యాలు, ప్రయాణికుల ఆర్తనాదాలు ఆ మొబైల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది.
अंगावर शहारे आणणारा हा व्हिडीओ…
नाशिकमध्ये बस दरीत कोसळली, अपघाताचा LIVE व्हिडीओ समोर आला…. 👇 pic.twitter.com/gmonkugZKN— Ganesh (@GaneshD56174762) July 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

