బీఎస్పీ శాసనసభా పక్షనేతపై వేటు
శాసనసభా పక్షనేత| ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన శాసనసభా పక్షనేతతో సహా మరో ఎమ్మెల్యేను బహిష్కరించింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన శాసనసభా పక్షనేతతో సహా మరో ఎమ్మెల్యేను బహిష్కరించింది. రాష్ట్రంలో గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షనేత లాల్జీ వర్మ, మరో ఎమ్మెల్యే అచల్ రాజ్భర్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని, వారిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వర్మ స్థానంలో షా ఆలమ్ను శాసనసభాపక్ష నేతగా పార్టీ నియమించింది. బహిష్కృత నేతలను ఎలాంటి పార్టీ కార్యలపాలకు ఆహ్వానించకూడదని ప్రకటించింది. వారికి భవిష్యత్లో పార్టీ టికెట్ కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

