BSF troops | ఎముకలు కొరికే చలి.. శత్రువులు ఎటు వైపు నుంచి వస్తారో తెలియదు.. అనుక్షణం అప్రమత్తత అవసరం.. ఇది సరిహద్దులో దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల పరిస్థితి. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వర్తించడం అంటే అంత సులభమేమీ కాదు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. అయినా మన బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశం, ప్రజల రక్షణకై శ్రమిస్తున్నారు. ఓ దిక్కు ఎముకలు కొరికే చలి.. మరోవైపు ఏకధాటిగా మంచు పడుతున్నా అవేవీ లెక్కచేయకుండా తమ విధుల్లో నిమగ్నమయ్యారు. మంచు వర్షంలోనూ భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Jammu & Kashmir: BSF troops patrolling in heavy snow in Kashmir Valley
(Video source: BSF) pic.twitter.com/DaPqWYVyRl
— ANI (@ANI) January 13, 2023