MP Nama Nageshwar Rao | న్యూఢిల్లీ : రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఎంపీ నామా మాట్లాడారు. కవితను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో శివసేన పార్టీపై కూడా బీజేపీ కుట్రలు చేసి, పార్టీని విచ్ఛిన్నం చేసిందన్నారు. బీజేపీ తన పాలసీలను ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్చుకున్నారు. కవితను ఒక్క మహిళ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు అని ఎంపీ నామా మండిపడ్డారు.
గత పదేండ్లలో కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. రైతుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని తాను కోరుతున్నాను. రానున్న రోజుల్లో తమ పార్టీకి న్యాయం జరుగుతుందన్న సంపూర్ణ నమ్మకము ఉందని ఎంపీ నామా నాగేశ్వర్ రావు తెలిపారు.