లోక్‌సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..
అదానీ గ్రూప్ సంస్థల నిర్వాకంపై పార్లమెంటులో చర్చించాలని బీఆర్ఎస్ నిరసన కొనసాగుతున్నది. లోక్‌సభలో హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల నిర్వాకంపై పార్లమెంటులో చర్చించాలని బీఆర్ఎస్ నిరసన కొనసాగుతున్నది. లోక్‌సభలో హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇతర బిజినెస్‌లను వాయిదావేయాలని, తక్షణమే అదానీ నిర్వాకంపై చర్చకు అనుమతివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల నిర్వాకంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా 7 రోజులపాటు అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చ కోసం రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, దిగువ సభలో బీఆర్ఎస్ లోక్‌సభాపక్షా నేత నామా నాగేశ్వరరావు మరోసారి వాయిదా తీర్మానాలకు పట్టుబట్టారు. ఈ నోటీసులను ఉభయ సభల్లో తిరస్కరించటంతో కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. అయినా చర్చకు అనుమతి ఇవ్వకపోడంతో బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేసి, పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీవిగ్రహం వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల విరామం తర్వాత సోమవారం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో అదానీపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

