ఛత్రపతి శివాజీ సొంతూరు నుంచే బీఆర్ఎస్ ఎన్నికల యాత్ర : సీఎం కేసీఆర్
CM KCR | మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి బీఆర్ఎస్ ఎన్నికల యాత్రను పది రోజుల్లో ప్రారంభిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. ఈ దేశంలో కిసాన్ సర్కార్ రావాలని ప్రతిజ్ఞ చేసి, యాత్రను ప్రారంభిస్తామన్నారు.
CM KCR | మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సొంతూరు శివనేరి నుంచి భారత్ రాష్ట్ర సమితి ఎన్నికల యాత్రను పది రోజుల్లో ప్రారంభిస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ దేశంలో కిసాన్ సర్కార్ రావాలని శివాజీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేసి, యాత్రను ప్రారంభిస్తామన్నారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి యాత్ర ప్రారంభం అవుతుందన్నారు కేసీఆర్. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి బీఆర్ఎస్ వాహనాలు వస్తాయన్నారు. మహారాష్ట్రలో ఊరూరా బీఆర్ఎస్ కిసాన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాను కూడా ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో అమలయ్యే ప్రతీ పథకం మహారాష్ట్రలో అమలవుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. తన శక్తి ఉన్నంత వరకు ఈ దేశం బాగు కోసం పోరాడుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తన ప్రసంగం ముగించే ముందు.. జై మహారాష్ట్ర.. జై భారత్.. జై హింద్ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

