Bridge Collapses | ఇంద్రయాణి నదిపై కూలిన వంతెన.. ఆరుగురు మృతి.. 20 మంది వరకు గల్లంతు..!
Bridge Collapses | మహారాష్ట్ర పుణే జిల్లాలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకున్నది. పింప్రి-చించ్వాడ్ పీఎస్ పరిధిలోని ఇంద్రయాణి నదిపై వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్ షుల్కే తెలిపారు.
Bridge Collapses | మహారాష్ట్ర పుణే జిల్లాలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకున్నది. పింప్రి-చించ్వాడ్ పీఎస్ పరిధిలోని కుందమలలో ఇంద్రయాణి నదిపై వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్ షుల్కే తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం గల్లంతయ్య వారి కోసం గాలిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన కుందమలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇంద్రయాని నదిని దాటేందుకు వంతెనను నిర్మించారు. ఇటీవల రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లుగా తెలుస్తున్నది.
ఈ వంతెన కూలిపోవడంతో పర్యాటకులు నదిలో పడి కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని సహాయ సిబ్బంది రక్షించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వంతెన కూలడంతో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆరుగురు మరణించారన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అంబులెన్స్‌లను సంఘటనా స్థలంలో మోహరించామని.. పర్యాటకులను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

