తన పెళ్లికి రావాలంటూ అందరికీ ఆధార్ కార్డులు పంచిన పెళ్లికొడుకు.. ఎందుకో తెలుసా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డును చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. అది అచ్చం ఆధార్ కార్డులా ఉంటుంది.
సాధారణంగా వెడ్డింగ్ కార్డ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. ఏ వెడ్డింగ్ కార్డు అయినా ఒకే ఫార్మాట్లో ఉంటాయి. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డును చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. అది అచ్చం ఆధార్ కార్డులా ఉంటుంది. సడెన్గా చూస్తే అది ఆధార్ కార్డే కావచ్చు అని అనుకొని పప్పులో కాలేస్తారు.
కానీ.. అది ఆధార్ కార్డు కాదు.. అది వెడ్డింగ్ కార్డే. ఛత్తీస్ఘడ్కు చెందిన లోహిత్ సింగ్ అనే వ్యక్తి తన పెళ్లిని వెరైటీగా జరుపుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా వెడ్డింగ్ కార్డునే ఆధార్ కార్డుగా మార్చేశాడు.
జాష్పూర్ జిల్లాలోని అంకిరా గ్రామానికి చెందిన సింగ్.. ప్రభుత్వ ఉద్యోగి. అలాగే తన ఊళ్లో ఆధార్ సెంటర్ను కూడా నిర్వహిస్తుంటాడు. తన చేసే పని ఆధార్ కార్డుది కాబట్టి.. తన పెళ్లి పత్రికను ఆధార్ కార్డు తరహాలో ప్రింట్ చేయించాడు. తన పెళ్లికి రావాలంటూ అందరికీ ఆధార్ కార్డులా ఉన్న పెళ్లి పత్రికను పంచుతున్నాడు. తన పెళ్లి పత్రికను చూసిన నెటిజన్లు, స్థానికులు అయితే ముక్కున వేలేసుకుంటున్నారు. తన బంధువులు కూడా పెళ్లి పత్రికను చూసి షాక్ అవుతున్నారు.

ఇలా సరికొత్తగా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడం అనేది ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా మంది తమ పెళ్లి పత్రికను రకరకాలుగా కొట్టించారు. తాజాగా ఆధార్ తరహా వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Justin Bieber | రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న జస్టిన్ బీబర్.. ఎందుకో తెలుసా?
Lata Mangeshkar | సినీ అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే లతా మంగేష్కర్ పాటలు ఇవే
Viral Video: తగ్గేదేలే అంటున్న ఏనుగు… జేసీబీతో భీకర పోరు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

